చలం సాహిత్య సుమాలు
ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ కొన్ని యేళ్ళుగా ప్రతి నిత్యం తనను ప్రభావితం చేసిన చలం రచనల నుంచి ఈ కొటేషన్స్ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు. ఇంతకీ చలం ఏమంటాడు? అంటూ సార సంగ్రహం కోసం ఎదురుచూసే వారికి చలం భావ రుచిని చిన్న చిన్న కొటేషన్‌లుగా ఈ సంకలనంలో అందించారు. చలం ఉండగానే చందర్ ఈ సంకలనం కూర్చి చలంగారి హిడెన్ హయ్యర్ సెల్ఫ్ ను వారికే చూపించి ఆశ్చర్యపరిచారు. చలంగారు రాసిన వేలకొద్దీ పేజీలను, ప్రతి అక్షరాన్నీ విడవకుండా చదివిన పాఠకోత్తముడు చందర్ గారు ఒకరేనేమో.
చలం సాహిత్య సుమాలు
పేజీలు 280. వెల: రూ.250
ప్రచురణ: చలం ఫౌండేషన్
ఫోన్ :9440994244