బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం
బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.
Labels: consumer forum, consumer rights
